Wednesday, August 19, 2009

శరణార్ధిని



శరణార్ధిని


తొలి పలుకు

"శరణార్ధిని" అను నీ చిన్ని కావ్యానికి తొలిపలుకు నేను వ్రాయటానికి కారణం "కృతికర్త" కవి మిత్రులునయిన శ్రీసీతారామ మూర్తి గారి సుహ్రుదనుశాసనం. బాల్యం నుండీ వారికుండే కవిత్వభిలషా, భావోదత్తాలైన పాటలూ ,పద్యాలూరచించే వారి అపూర్వ కవిత శక్తీ , నాకు తెలుసును. వారి కంఠం మధురం, హృదయం మధురం , కావున కవిత్వంమధురంగా ఉంటుందని వేరే చెప్పనక్కర లేదు. ఈవికి ,ఠీవికి, విశ్రుతమైన వంశంలో జన్మించేరు. శ్రీ సీతారామ మూర్తి గారు నిరాడంబరమైన జీవితం గడుపుతూ కష్ట జీవుల ఆవేదనను అర్ధం చేసుకొని ,వారి బాధను తనదిగా భావించి కరిగిమరిగే కోమల హృదయం వీరిది. అలాంటి హృదయం నుండీ ఇలాంటి కావ్యం వేలువడటంలో ఆశ్చ్శర్యమేముంది?
కావ్యం లోని ఇతి వృత్తం పౌరాణికం గాని చారిత్రకం గాని కాదు. మరి ఒక అనాధయైన ఇల్లాలివిషాదాంత జీవిత గాధ. కావ్యం భరత భూమి వర్ణనతో ప్రారభం అవుతోంది.

శ్రీ సదావాసమ్ము శ్రేయోవిలాసమ్ము

సత్కళానంద విశ్రామభూమి

ప్రేమస్రవంతికోద్దామ ప్రవాహమ్ము

సత్య విజ్ఞాన విశ్వాసభూష

సంగీత సాహిత్య శృంగార భూమిక

మంగళకామ నారంగభూమి

ఆధ్యాత్మభావ నాధ్యపనాయతవేది

కరుణార్ద్ర వాటిక కర్మపీఠి


ప్రధిత భరతమ్మ ఖండమ్ము భారతమ్ము

రత్న నగరత్న నగర విరాజితమ్ము

నదనదీ స్వాదు జలకల నాదముదిత

నవనవోన్మేష సస్య పూర్నమ్ము సహ! !

కావ్యం లోని కధకు ఇట్టి వర్ణనతో ప్రారంభం ఎంతో చక్కగా ఉంది . అందు లాహోరు నగరం . ఆ నగరాన్ని 'కడుపు గడుపుగ' దూర ప్రవాసి ఒకడు అర్ధాంగ లక్ష్మి తో కూడ చేరి నాడు. కష్ట జీవి రెక్కాడితే దోక్కాడుతుంది. కాయ కష్టమే అతనకి ఆప్త భందువు.


గీ : " దూర దేశాన" 'నా' యను వరలెవారు ,
లేక 'రెక్కాడ' డొక్కాడు లేమి బ్రతుకె
యైన కష్టించి సంతృప్తి యైన బ్రతుకు
బ్రతుకు చుండిరి మన కధా బంధు లచట.
ఇలా కొన్నేండ్లు గడచేయి. ఇంతలో


" మిన్కు
మినుకని లోలోన మెఱయుచున్న
భవ్య దాంపత్య జీవన భవనమునకు
వెలుగుఁనగు పాప కలుగు చిన్నెలును చూపె "

ఇచట పడిన అలంకారం నిజంగా వెలుగుఁ వంటిదే. కాలం ఒక్క తీరుగ వెళ్ళదు. భారత దేశం రెండు ముక్కలయింది. మత కలహ మహాప్రళయం ముంచు కొచ్చింది.మానవుని ఆత్మౌన్నత్యం కోసం ఏర్పడిన మతం మానవుని ధ్వంశానికి కారణమయింది. మత కలహ మారణ హోమంలో పడి నశించిన వేలకొలది కుటుంబాల దురవస్థకు వర్ణించిన ఘట్టం హృదయ విదారకం. మతావేశానికి లోనయిన మానవులు రాక్షసుల కంటే హీనంగా ...

"తల్లుల యోడుల పాల్ద్రావు పిల్లలఁ జిమ్మి,
చెండులవలె తలల్ చెండువారు ,
పీకలం బిసుకుచు, ప్రేగులం బీకుచు
గ్రుడ్లూడదీయుచు గ్రుద్దువారు
నిండు చులాండ్రను ఖండించి గర్భస్థ
పిండ స్థితిని చూచుచుండువారు
మానభంగము కొడంబడని మానవతుల
బంధించి పశువృత్తిఁ బరుగువారు

రౌద్ర భీభత్స మత్త కరాళ రూప
ములను దాల్చిన యవ మృత్యు ముఖులవారు
మరణా యత్త యంత్రాల మాడ్కి కోరి ,
ఘోర విధ్వంస సల్పిరి క్రూరులగుచు ,

పెను ప్రళయంలో చిక్కుకొన్న కధా నాయకుడు యీ అంధ లోకాన్ని వీడి తన ఇల్లాలిని అనాధను చేసి పోతాడు. మండు టెడారిలో ప్రపవలె ఒక వుదార హృదయుడగు వైద్య్డుడీమెకాశ్రయమిస్తాడు. కాని విధికి ఆమెపై కనికరము లేదు.

" నెల గడచినో లేదో ఆ నెల పయిన్
వెజ్జునాలి నీచపు దృష్టిన్
తలపడి యనుమానింపగఁ గలతలు
గృహమందుఁ బుట్టెఁ గాలికి బొగులుగన్"

ఇంకెలా ఉండ గలదాయింట్లో? ఇలు వీడి నిండు చూలాలు కస్టపడి జీవించడానికి ప్రయతిస్తుంది. కాని గర్భ భారంచే కష్ట జీవనానికి అనువు గాక భిక్షాటన ఇష్టం లేకపోయినా ఆమె అవలింబవలసి వస్తుంది . ఈ సందర్భంలో కవి వర్ణించిన నిరు పేదల దుస్థితి ఘట్టం చదువుతూ ఉంటే ఎంతటి శిలా హృదయమైనా ద్రవీభూతం కాక తీరదు.

" కఱిగిన గుండెతో మఱగి కారిన భాష్పపు ధారతో నదే
కరుణ రసమ్ముఁ జిమ్ము నొక గాజు కలమ్మునుఁ జేత బట్టి
బరువు భరింపలేని
అతి భావుకుడగు" కవి వ్రాసి పెట్టినకావ్యమియ్యది .

ఆ సందర్భంలోని పద్యాలు భావ గంభీరములు. కవిత్వం సరళం , మధురం, ఉదారం . కవి యొక్క క్రాంతి దర్శిత్వమిట సువ్యక్తం. రచన ధరాశుద్ధి కలిగి, అర్ధాను రూపమైన శబ్ద విన్యాసంతో భావంపు తావుల గుమగుమలు గుభాలించుచుపరువులిడు నట్టిది. కబ్బం లో కతుత్వం కనబడదు. భిక్ష కోసం బయలుదేరిన నిండు చూలాలు అనాధను భావించికవి హృదయం కలత చెందింది. ఇక అతని కలం లోంచి చిలుకు నట్టి పలుకులు....

చం: ప్రణయ తరంగ దోలికలపై మధురమ్మునగాధమైన, జీ
వనపధమందు మోద మొదవంబయినించిన యీ విలాస నౌ
కననిటులో తుఫాను పెనుగడ్డయి యడ్డుట ముంగుచుండె, నెం
దును దరిఁ జేరు నెసుడి నదోగతి పట్టి మునుంగకుండునే.

చం: " ఇదియొక సిద్ద హస్తుడగు నీశ్వర శిల్పి యనల్ప కల్పనా
భ్యుదయముఁ జూపి మసవ విభూతిని లోతు నెఱింగి నేర్పుతో
పొదిపిన ప్రేమ మందిర మపూర్ణమునై శిదిలావశేషమై
తుదగనుచుండెనిట్లు పరిధూత ధరావివరాంత రాప్తయై.

చం: మొలకలు ద్రోసి మోసలకు ముచ్చటరేకులు మూసి లేగోనల్
మెలికలు వ్రాసి పూతకెల మిందల పెట్టిన తీవ యిద్ది జా
బిలి చలువన్ వలంచి తొలిఁ బెట్టిన యా కళికమ్మ నింక నీ
వలగన రాదు వ్రేటు పడె వాడుట మూడుట కూడ చూడమే?


చం: కఱిగిన గుండెతో మఱగి కారిన భాష్పపు ధారతో నదే
కరుణ రసమ్ముఁ జిమ్ము నొక గాజు కలమ్మునుఁ జేత బట్టి
బరువు భరింపలేని
అతి భావుకుడగు" కవి వ్రాసిపెట్టెనో
చెరుగుచునున్నదీ కవి జీర్నములై ఎడి పోవ పర్ణముల్



"వర్ణనాతీతమందొక వరపురమ్ము"

మ: అది "లాహోరుటవారు "హిందుముస్లిమ్మన " ప్రభేధంములన్

యెదలో నెంచక "భాయి భాయి " యనిఎన్నో నేండ్లుగా నుండి రే

యదరుంబోరున లేక నెయ్యమున వియ్యమ్మంది యింపొంది,యా

పదలం దొక్కరి కొక్కరాప్త గతి తోట్పాటౌదురానాటికిన్"


తే : గీ : కడుపుఁగడపగ నచట నౌకరి లభింప

వలస పోయెను దూర ప్రవాసి యొకఁడు .

ఆతని యర్ధాంగ లక్ష్మియే యగుటఁజేసి

తోడు నీడగ భార్యతోడ్తోడనేగె .

...........................................................................................................................................................
.............................................................................................................................
........................................................................................................

ఇట్లు
సాహిత్య విద్యా ప్రవీణ , భాషా ప్రవీణ
ఆయల సోమయాజుల నరసింగ రావు ,
ఎమ్. ;బి. ఎల్.
( ఆంధ్ర భాషోపన్యాసకులు )
కృష్ణ చంద్ర గజపతి కాలీజీ
పర్లాకిమిడి
1954

Sunday, August 16, 2009


జననం : ఆనంద నామ సంవత్సరం (సెప్టెంబర్ 1914) ,కుద్దిగాం అగ్రహారం , శ్రీకాకుళం జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
విద్యాభ్యాసం: మహారాజావారి సంస్కుత కళాశాల ,విజయనగరం , మహారాజావారి సంస్కుత కళాశాల, పర్లాకిమిడి
పట్టా : సాహత్య విద్యా ప్రవీణ , ఆంధ్రా విశ్వ కళా పరిషత్ ,1935
ఉద్యోగం : 1946-47 , మహారాజావారి సంస్కృత కళాశాల , పర్లాకిమిడి
1947-1974 మహారాజావారి బాలకోన్నత పాఠశాల ,పర్లాకిమిడి
ప్రచరణలు : శరనార్ధిని ,ఏకలవ్య ,గంగోపఖ్యానం, నృతి మంజరి , నివేదన ( పద్య కావ్యములు )
త్రిభాషిక ( తెలుగు , హిందీ , ఒరియా వ్యాకరణ సూక్తులు )
ఇవికాక వివిధ పత్రికల్లో ఎన్నెన్నో ప్రచరణలు
సంతానం : కుమారులు -5, కుమార్తెలు -3, మనుమలు-21
Download

Friday, August 14, 2009






1914-2009

Born in 1914, Sri Bhallamudi Seetrama Murty , well known as " Abbai" to all his near and dear ones, was the eldest of the four children of Sri Venkata Suryanarayana murty and kameswaramma.


His degree in Sanskrit earned him the title " SIROMANI"

He was a Pandit, scholar and great poet. He wrote poetry in both Sanskrit and Telugu.

  • "Tribhashika" he wrote in Telugu, Oriya and Hindi helped many students to learn grammar in all the three languages simultaneously.
  • " Saranardhini" his master piece poetry in Telugu was a prescibed as text book for Intermediate in Orissa and also later for Deploma in Oriental languages in A.P.
  • The other published works include : Ekalavya, Gangopakhyanam and Nivedana in Telugu and Nruthimanjari in Sanskrit.

He taught in Maharaja's Boy's High School in Parlakimidi, Gajapati District , Orissa .

He was a dramatist and an aclaimed theatre artist.






Thursday, August 13, 2009

End of an Era!



1914-2009

SRI Bhallamudi Seetarama Murty, Our father left for the heavenly abode at 3.45 am today, Thursday,13th August 2009
We pray that his soul rests in peace.

My HOME